| కీర్తనలు | మైసూర్ వాసుదేవాచార్య | ఎంతనిర్దయ నామీద నీకు |
| లతాంగి - చతురశ్ర త్రిపుట |
| పల్లవి: |
| ఎంతనిర్దయ నామీద నీకు దంతివరద శ్రీరుక్మిణీరమణ॥ |
| అనుపల్లవి: |
| చింతితార్థదాయకుడనుచు దెలిసి సంతతంబు నిన్నే నమ్మితి నయ్య॥ |
| చరణము(లు): |
| వారిజాసనాది వినుతపాద నాదు ఘోరపాపజాలమెల్ల దీర్చుటకు॥ |
| వారిజాక్ష వాసుదేవ నీవుగాక వేరెవ్వరున్నారయ్య బ్రోవవయ్య॥ |