| కీర్తనలు | మైసూర్ వాసుదేవాచార్య | బ్రోవరాద శ్రీవెంకటేశ నన్ను |
| వరుణప్రియ - చతురశ్ర త్రిపుట |
| పల్లవి: |
| బ్రోవరాద శ్రీవెంకటేశ నన్ను శ్రీవాసుదేవ శ్రితపారిజాత॥ |
| అనుపల్లవి: |
| నీవ జీవులకు నిత్యరక్షకుడై కావవేమి శ్రీకర దేవదేవ॥ |
| చరణము(లు): |
| భక్తిరక్తి విరక్తుల నేనెరుగ భక్తపాల నా చింతలెల్లదీర్చి॥ |
| ముక్తయోగి వరాసక్తచిత్త వర ముక్తిమార్గమును జూపివేగముగ॥ |